Wednesday, July 28, 2010
హాస్యాస్పదం
సున్నితమైన హాస్యం, వ్యంగ్యం అణువణువునా తొణికసలాడే సంభాషణలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రచయిత డి.వి. నరసరాజు గారు. సన్మానాలు, బిరుదులపై ఆయన విసిరిన ఓ ఛలోక్తి ............
ఒకప్పుడు ఒకానొక ' కళాసమితి ' వారు నాకు సన్మానం చేస్తామని వచ్చారు.
సన్మానంతో బాటు బిరుదు కూడా ఇవ్వదలచుకున్నామని చెప్పారు.
" ఏం బిరుదు ఇస్తారు ? " అని అడిగాను.
" మీరు హాస్యం బాగా రాస్తారుగనుక ' హాస్యాస్పదబ్రహ్మ ' అని ఇద్దామనుకున్నాం " అన్నారు.
" ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. తర్వాత చేయించుకుంటాను సన్మానం " అని పంపేసాను.
' హాస్యం ' , ' హాస్యాస్పదం ' ఈ రెండు పదాలకు తేడాలేదు వారి దృష్టిలో.
మిత్రుల ఇళ్ళకు వెడితే వాళ్లకిచ్చిన సన్మాన పత్రాలు గోడలకు తగిలించినవి, షో కేసులలో పెట్టివున్నవి తీరిగ్గా చదవడం నాకు ఎంతో ఇష్టం !
వాటిలో ఎంతో ' హాస్యం ' వుంటుంది. ' హాస్యం ' , హాస్యాస్పదం ' లాంటిదే !
Vol. No. 01 Pub. No. 356
లేబుళ్లు:
ఛలోక్తులు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బర...
-
తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొద...
-
ఆమె నటనలో జీవించింది కానీ జీవితంలో నటించలేదు ఆమె నటన ఎందరికో మార్గదర్శకం కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం తెలుగు చిత్రసీమ గర్వంగ...
-
తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థ...
-
వికృతి చేసిన విలయతాండవాన్ని మరిపించి ఆనందతాండవం చేయించడానికి విచ్చేసిన శ్రీ ఖర నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతూ ......... ........
3 comments:
హాస్యాస్పదం ఛలోక్తి చాలా బావుంది.Thank U sir
మా మాజీ/దివంగత మునిసిపల్ చైర్మన్ గారు, "శోచనీయం" స్థానం లో "ముదావహం" అని ప్రయోగించి, పావుగంటలో పదహారు ముదావహాలు వేసినట్టే వుంది!
(చూ:- "క్యామెడీ ఛానెల్"లో నా పాత టపా!)
* హాసిని గారూ !
* కృష్ణశ్రీ గారూ !
ధన్యవాదాలు
Post a Comment